ప్రచారంలో జోరుగా దూసుకుపోతున్న టిడిపి జనసేన బిజెపి కూటమి అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి

ప్రచారంలో జోరుగా దూసుకుపోతున్న టిడిపి జనసేన బిజెపి కూటమి అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి
ప్రచారంలో జోరుగా దూసుకుపోతున్న టిడిపి జనసేన బిజెపి కూటమి అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి

*వైసీపీని ఓడిస్తే రాక్షస పాలన నుంచి ప్రజలకు విముక్తి* 

*ఏపి కి దిశా దశ ఉన్న నాయకుడు చంద్రబాబు* 

*ఈ ఎన్నికల్లో టీడీపి సైకిల్ గుర్తుకు ఓటు వేయండి* 

*అమడగూరు మండలం ఎన్నికల ప్రచారంలో టీడీపీ కూటమి అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి* 

అమడగూరు:01/05/2024

వైసిపి పార్టీని ఎన్నికల్లో ఓడిస్తే రాష్ట్రంలో కొనసాగుతున్న రాక్షస పాలనకు విముక్తి లభిస్తుందని నియోజకవర్గ టిడిపి ఉమ్మడి అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. టిడిపి సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ బుదవారం అమడగూరు మండలంలోని జెకేపల్లి మహమ్మదాబాద్ పంచాయతీలోనీ గ్రామాల్లో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆమెకు స్థానిక ప్రజలు పూల వర్షం కురిపిస్తూ బాణాసంచా కాల్చి అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పల్లె సింధూరరెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కు దశ దిశా ఉన్న ఏకైక నాయకుడు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం టిడిపి అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాష్ట్రంలో రాక్షసి పాలనకు ప్రజలు స్వస్తి పలకాలని పిలుపునిచ్చారు పుట్టపర్తి నియోజకవర్గంలో ప్రశాంతమైన పాలన కావాలంటే టిడిపి ఉమ్మడి అభ్యర్థి పల్లె సింధూర రెడ్డిని గెలిపించాలని కోరారు మళ్ళీ వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని గెలిపిస్తే భూదందాలు వసూళ్లు అవినీతి పాలన రాజ్యం ఏలుతుందని ప్రజల్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.